యూరప్‌ టూర్‌కు జగన్.. ట్రెండీ లుక్‌తో సోషల్ మీడియాలో వైరల్!

  • కుటుంబంతో కలిసి యూరప్ పర్యటనకు వెళ్లిన వైఎస్ జగన్
  • బ్లూ డెనిమ్ షర్ట్, జీన్స్ ప్యాంట్‌తో ట్రెండీ లుక్‌లో జగన్
  • జగన్ కొత్త లుక్‌పై సోషల్ మీడియాలో జోరుగా చర్చ
వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి యూరప్ పర్యటనకు బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన సరికొత్త డ్రెస్సింగ్ స్టైల్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన కొత్త లుక్‌కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అర్ధరాత్రి బెంగళూరు విమానాశ్రయం నుంచి ఆయన కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లారు. యూరప్‌లోని పలు దేశాల్లో పర్యటించేందుకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాల ప్రకారం మే 15వ తేదీ వరకు ఆయన యూరప్‌లోనే గడపనున్నారు. వాస్తవానికి ఈనెల 20నే ఈ పర్యటన మొదలుకావాల్సి ఉన్నా, కొన్ని కారణాల వల్ల ఐదు రోజులు ఆలస్యమైంది.

ఈ పర్యటనలో జగన్ డ్రెస్సింగ్ స్టైల్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రాజకీయ కార్యక్రమాల్లో సాధారణంగా తెల్లటి చొక్కా, ఫార్మల్ ప్యాంటు, సాధారణ చెప్పులతో కనిపించే జగన్.. ఈసారి అందుకు భిన్నంగా ట్రెండీ లుక్‌లో దర్శనమిచ్చారు. బెంగళూరు ఎయిర్‌పోర్టులో ఆయన బ్లూ డెనిమ్ ష‌ర్ట్‌, బ్లూ జీన్స్ ప్యాంట్‌, షూస్‌ ధరించి కనిపించారు.

ఎయిర్‌పోర్టులో జగన్‌ను ఈ కొత్త లుక్‌లో చూసిన ప్రయాణికులు, అభిమానులు ఆశ్చర్యపోయారు. ఆయనతో ఫొటోలు, వీడియోలు తీసుకునేందుకు ఆసక్తి చూపారు. ప్రస్తుతం ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ‌ చక్కర్లు కొడుతున్నాయి.

YS Jagan
YS Jagan Mohan Reddy
Jagan Europe tour
Jagan family tour
Jagan new look
YSRCP leader
Andhra Pradesh news
Bangalore airport
Jagan trending photos
Jagan denim shirt
Europe travel

More Telugu News